రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల సమన్వయం అవసరం

1337చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల సమన్వయం అత్యవసరమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీస్, ఎన్‌హెచ్ఏఐ అధికారులతో కలిసి NH-16, NH-216A జాతీయ రహదారులను ఆయన సంయుక్తంగా తనిఖీ చేశారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణమే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్