అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా రంగంపేటలో ఆదివారం రాత్రి కాగడాల ర్యాలీ జరిగింది. పోలీసులు అనుమతి లేదని ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొని, స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.