పెదపూడి మండల కేంద్రంలోని హెచ్. జి. ఎమ్. ప్రార్థనా మందిరంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'ఇండియన్ క్రిస్టియన్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, పాస్టర్లు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.