ఫిబ్రవరి నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్‌లను ఫిబ్రవరి 1న ప్రభుత్వ సెలవు దినం కావడంతో, ఒక రోజు ముందుగానే జనవరి 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 2,71,344 మంది లబ్ధిదారులకు రూ. 118,64,17,500 ఇంటి వద్దకే చేరవేయడానికి 4,600 మంది పిడిఓలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.