రంగంపేట పాత్రికేయుల సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ

1005చూసినవారు
రంగంపేట పాత్రికేయుల సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ
రంగంపేట మండలం పాత్రికేయుల సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా కుండేటి వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా కొమరపూడి శ్రీనివాసరావు, కార్యదర్శిగా లోలబట్టు వీరభద్రరాజు, సహాయ కార్యదర్శిగా నాగేంద్రబాబు, కోశాధికారిగా నడిపల్లి శ్రీనివాసమూర్తిలను శాసనసభ్యుడు ప్రత్యేకంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.