తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు నుండి అనపర్తి వరకు 11.8 కిలోమీటర్ల ప్రధాన రహదారికి మోక్షం లభించింది. ఈ రహదారిపై నిత్యం రాకపోకలు సాగించే బిక్కవోలు ఎఫ్ సి ఐ గూడమ్స్ కార్మికులు, రైల్వే స్టేషన్, రామచంద్రపురం, అనపర్తి గ్రామ ప్రజలు రహదారి నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వారు అభినందనలు తెలిపారు. ఈ రహదారి వల్ల ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.