తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ప్రముఖ
వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరారు. రామవరం
వైసీపీ నాయకులు సబ్బెళ్ళ అమ్మిరెడ్డికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, సొసైటీ మాజీ సభ్యులు గొలుగూరి వెంకటరమణ రెడ్డికి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి
టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో కుతుకులూరు, రామవరం గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.