శృంగేరి శారదా పీఠంలో రామాయణ పారాయణ బృందం ప్రత్యేక పూజలు

390చూసినవారు
శృంగేరి శారదా పీఠంలో రామాయణ పారాయణ బృందం ప్రత్యేక పూజలు
కొంకుదురుకు చెందిన బ్రహ్మశ్రీ రమణ శర్మ నేతృత్వంలోని రామాయణ పారాయణ బృందం గురువారం కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంలో సౌందర్యలహరి, శివస్తుతితో కూడిన శివాష్టకం, శ్రీ దుర్గా సప్తశతి పారాయణం నిర్వహించింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ, భవిష్యత్తు గురువులు విధుశేఖర భారతీల ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ భాస్కర శర్మ, పంతులు మాస్టారు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్