31 నుంచి శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మ వారి జాతర మహోత్సవం

682చూసినవారు
31 నుంచి శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మ వారి జాతర మహోత్సవం
అనపర్తి మండలం కొప్పవరం గ్రామాల్లో కొలువైయున్న శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 31వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకలు జరుగుతాయి. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపడతామని వారు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్