అనపర్తి మండలం రామవరంలో మంగళవారం రంగంపేట మండలం జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కుందేటి వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొమరపూడి శ్రీనివాసరావు, కార్యదర్శి లోల బట్టు శ్రీ వీరభద్ర రాజు, సహాయ కార్యదర్శి నాగేంద్రబాబు తదితరులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు.