కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: దేవినేని ఉమా

3చూసినవారు
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: దేవినేని ఉమా
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం వీరంపాలెంలో శుక్రవారం జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులకు ఆయన సూచనలు చేశారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు తలెత్తితే పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని అన్నారు. నాయకత్వ నిర్ణయాలకు అనుగుణంగా సమష్టిగా పనిచేయాలని, ఐక్యతే కూటమికి బలమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇన్చార్జ్ మనోజ్ రెడ్డి, జనసేన ఇన్చార్జ్ రావాడ నాగు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్