ప్రభుత్వ ఆదేశాల మేరకు, కుష్టు నివారణ పక్షోత్సవాలు ఈ ఏడాది స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమంగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. కుష్టు వ్యాధిగ్రస్తులను వివక్షతకు తావులేకుండా ఆదరించాలని ఆయన సూచించారు.