అంబాజీపేట: 'చేనేతలకు కూటమి ప్రభుత్వం అండ'

798చూసినవారు
అంబాజీపేట మండలం పుల్లెట్టికుర్రులో బుధవారం పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తోందని ఆయన వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు.