విలస గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

569చూసినవారు
అయినవిల్లి మండలం విలాస గ్రామంలోఆదివారం  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతను కేవలం జయంతి, వర్ధంతులకు పరిమితం చేయకుండా ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్