తాగునీటి సమస్య తీర్చేందుకు బోరు పనులు: ఎంపీటీసీ సూరయ్య కాపు

336చూసినవారు
తాగునీటి సమస్య తీర్చేందుకు బోరు పనులు: ఎంపీటీసీ సూరయ్య కాపు
పి. గన్నవరం: ఉడిముడి పంచాయతీ పరిధిలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు వాటర్ ట్యాంక్ వద్ద అదనపు నీటి వనరుల కోసం బోరు వేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఎంపీటీసీ సూరయ్య కాపు స్వయంగా పర్యవేక్షించి, సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి నీటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ ప్రాధాన్యత అని, పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలిపారు. స్థానికులు గత కొంతకాలంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్