ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఆలయం వెలుపల కొబ్బరి చెక్కల ఆటో పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగి, ఆటో నిర్వాహకుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి, సిబ్బందిని దుర్భాషలాడుతూ, సెక్యూరిటీ గార్డును నెట్టేసి ప్రధాన ద్వారాలను మూసివేశారు. దీంతో లోపల ఉన్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.