కోనసీమ, పి. గన్నవరంలోని అప్పనపల్లి మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన ఎస్ఎంసి ఎన్నికల్లో శ్రీ దొమ్మేటి ఈశ్వరరావు చైర్మన్‌గా, శ్రీ గెడ్డం ప్రతాప్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులతో ప్రధానోపాధ్యాయుడు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చైర్మన్‌ను సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నైనాల రఘు రామయ్య, సహాయ ఉపాధ్యాయులు, ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.