ముక్తేశ్వరం కాజ్ వే పైకి చేరుకున్న వరద నీరు

1383చూసినవారు
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా గోదావరి నదికి వరదనీరు పోటెత్తడంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వే వరద ముంపునకు గురైంది. దీనితో వీరవల్లిపాలెం, అద్దంకి వారి లంక వంటి లంక ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధవలేశ్వరం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఆదివారం లంక ప్రాంతాలు మరోసారి నీట మునిగాయి.