అచ్యుతాపురం జ్ఞానవి అకాడమీ విద్యార్థులు ఆదివారం పుణ్యక్షేత్రం అయినవిల్లిలో తమ తొలి కూచిపూడి నృత్య ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి, దైవ దర్శనంతో పాటు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అకాడమీ ప్రతినిధులు, విద్యార్థులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ప్రదర్శన చేపట్టారు.