లంకలగన్నవరంలో కొంబత్తుల సుజాత అనే మహిళ ఇంట్లో దొంగలు పడి భారీగా బంగారం, వెండి వస్తువులను అపహరించారు. రెండు నెలలుగా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో ఉంటున్న సుజాత, ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి, బీరువాలోని 50 గ్రాముల బంగారం, 24 తులాల వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.