అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామానికి చెందిన యినుకొండ రామానాయుడు (43) పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ నెల 7న వంతెన సమీపాన వశిష్ఠ గోదావరిలో స్నానానికి దిగిన ఆయన మృతదేహం శుక్రవారం నదిలో లభ్యమైంది. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.