పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం ముక్కామలలో గంగిరెద్దుల వారి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, బడుగు, బలహీన వర్గాల సౌకర్యార్థం ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటలక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.