మామిడికుదురులోని పురాతన బీబీ ఫాతిమా జహీరా దర్గాలో సోమవారం మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా మజ్లిస్ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో మర్సియా ఆలపించారు. మత ప్రబోధకులు మొహమ్మద్ కాజ్మీ నజఫీ కర్బలా యుద్ధ విశేషాలను, హజరత్ ఇమామ్ హుస్సేన్ పరివారంపై జరిగిన దాడులను వివరించగా భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మాతం నిర్వహించి ఫాతిమా జహీరాకు నివాళులర్పించారు.