పి. గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఇద్దరు యువకులు రేస్ బైక్ తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు ఆదివారం ఉదయం తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.