పి. గన్నవరం: అత్తవారింటికి వెళ్తూ అదృశ్యం.. ఆచూకీ కోసం గాలింపు

157చూసినవారు
పి. గన్నవరం: అత్తవారింటికి వెళ్తూ అదృశ్యం.. ఆచూకీ కోసం గాలింపు
పి. గన్నవరం మండలం జొన్నలంకకు చెందిన చందాడి శ్రీను (33) అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నంలోని అత్తవారింటికి వెళ్లిన శ్రీను, అక్కడికి చేరుకోకుండానే మాయమయ్యాడు. బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అతని తల్లి మారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్