పి. గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ 9 సచివాలయాలకు ప్రింటర్లను పంపిణీ చేశారు. ప్రజల పనులను తక్షణమే పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం వహించరాదని ఆయన సూచించారు. అనంతరం 'స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర' రథాన్ని ప్రారంభించి సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.