పి. గన్నవరం మండలం ఆర్. ఏనుగుపల్లిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేసి, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. గతంలో నాయకుల ఫోటోలతో పుస్తకాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఎటువంటి ఫోటోలు లేకుండా కేవలం రాజముద్రతో అత్యంత పారదర్శకంగా వీటిని అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.