పి. గన్నవరం: 108 అంబులెన్స్‌లో గర్భిణీకి సుఖ ప్రసవం

303చూసినవారు
పి. గన్నవరం: 108 అంబులెన్స్‌లో గర్భిణీకి సుఖ ప్రసవం
శనివారం వై. కొత్తపల్లికి చెందిన ఓ గర్భిణీకి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. పి. గన్నవరానికి చెందిన 108 సిబ్బంది ఈఎంటీ సత్యవేణి, పైలట్ రమేశ్ ఘటనా స్థలానికి చేరుకుని, ఆసుపత్రికి తరలించే లోపే అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం జరిపారు. అనంతరం తల్లిని, నవజాత శిశువును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్