
కొడుకు ఆత్మహత్య.. తట్టుకోలేక తల్లి కూడా మృతి!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలో తల్లితో జరిగిన చిన్న గొడవ కారణంగా 21 ఏళ్ల వివేక్ కుమార్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి గుడ్డి దేవి (55) తట్టుకోలేక చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.




