పి. గన్నవరం: 'అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చాలి

851చూసినవారు
పి. గన్నవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించి, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని, వేసవి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంపై ఈ నెల 18న ప్రకటన చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తూ, ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్