పి. గన్నవరంలో ‘సురక్షిత మాతృత్వ యోజన కార్యక్రమం నిర్వహణ

573చూసినవారు
పి. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 'ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ యోజన' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, ఆరోగ్య సూచనలు అందించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ వందన మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన శిశువు ప్రసవం కోసం గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్