పెదపట్నంలంక-బి. దొడ్డవరం వంతెన ప్రమాదకరం

550చూసినవారు
మామిడికుదురు మండలం పెదపట్నంలంక - బి. దొడ్డవరం గ్రామాల సరిహద్దులో ఉన్న ఆర్‌అండ్‌బీ వంతెన అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన రైలింగ్స్ పాడై, స్లాబ్ దెబ్బతిని ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉందని తెలిపారు. ప్రయాణికుల రక్షణ దృష్ట్యా వంతెనను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ సురేశ్ స్పందిస్తూ, నూతన వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపామని తెలిపారు.

సంబంధిత పోస్ట్