పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. వేదికపైకి రామచంద్రపురం నేత ఆకుమర్తి చిన్నాను ముందుగా పిలవడంతో మామిడికుదురు మండల నేత కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకుల తీరును తప్పుబడుతూ కిషోర్ సమావేశం నుంచి వెళ్లిపోతుండగా, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు సర్దిచెప్పి తిరిగి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అయితే, వివాదం సద్దుమణగకపోవడంతో ఏఎంసీ ఛైర్మన్ అలిగి వెళ్లిపోయారు.