లంకల గన్నవరంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర

728చూసినవారు
పి. గన్నవరం మండలం లంకల గన్నవరంలో బుధవారం రాత్రి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గరగ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ వినోద కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్