ఆలయాలు సంస్కృతికి ప్రతీకలు: పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి

403చూసినవారు
అయినవిల్లి మండలం క్రాప శంకరయ్య గూడెంలోని శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకకు పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయాల ద్వారానే ఆధ్యాత్మిక విలువలు, సనాతన సంస్కృతి తరతరాలకు అందుతాయని, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్