పుష్పయాగంతో ముగిసిన అప్పనపల్లి స్వామివారి కళ్యాణోత్సవాలు

1580చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఐదు రోజుల కళ్యాణోత్సవాలు ఆదివారం రాత్రి శ్రీపుష్ప యాగంతో వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు కన్నుల పండుగలా జరిపించారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది.

సంబంధిత పోస్ట్