బెల్లంపూడిలో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

2చూసినవారు
బెల్లంపూడిలో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
కోనసీమ, పి. గన్నవరం మండలం బెల్లంపూడిలో ఆదివారం మాజీ సర్పంచ్ బండి మహాలక్ష్మి తన కుటుంబంతో కలిసి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో పాల్గొన్నారు. అధికారులు, బీఎల్ఓలకు అవసరమైన పత్రాలు అందజేస్తూ, ఓటర్లంతా తమ వివరాలు, కలర్ ఫోటోతో కూడిన ఫారాలను ఈ నెల 14 లోపు సమర్పించాలని ఆమె కోరారు. సందేహాలుంటే సీఈఓ ఆంధ్ర వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, అర్హులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. బెల్లంపూడిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్