
గోపాలపురం: శివాజీ జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు
గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమలలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చిలక వీరస్వామి ఆధ్వర్యంలో హిందూత్వ వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. గురువారం నాయకులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో న్యాయం చరిత్రలో సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా మోర్చా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






































