తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో కొవ్వూరు మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో మంగళవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ఎంపీపీ కాకర్ల నారాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. మండల అభివృద్ధికి వారు అందించిన సేవలను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎంవీఆర్ సాయిబాబా, సీహెచ్. ఎస్. వెంకటరెడ్డి, ఎంపీడీవో ఎం. దుర్గాప్రసాద్, తహసీల్దార్ ఐ. వి. రాఘవులు, డీఎల్పీవోతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.