ద్వారకతిరుమ ( చిన్న తిరుపతి) వెంకటేశ్వర స్వామి కి చెందిన భూములను టిడిపి నాయకులు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు అండదండలతో కబ్జా చేసారని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి తానేటి వనిత గురువారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా, నాయకులు తో ధర్నా కార్యక్రమం నిర్వహించి జెసికి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో తూ. గో జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు , రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.