గోపాలపురం మండలంలో పెన్షన్ పండుగ కార్యక్రమం నిర్వహణ

219చూసినవారు
గోపాలపురం మండలంలో పెన్షన్ పండుగ కార్యక్రమం నిర్వహణ
గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలో శనివారం పెన్షన్ల పండుగ కార్యక్రమం జరిగింది. భర్తలు మరణించిన మహిళలకు స్పోజ్ పెన్షన్ సకాలంలో అందిస్తామని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాయుడు, గోపాలపురం మండలం మహిళా అధ్యక్షులు పద్మ, జనసేన గ్రామ అధ్యక్షులు షేకు హుస్సేన్, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ల పండుగ కార్యక్రమంలో వారు ఈ హామీని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్