వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా అనసూయ సురేష్ నియామకం

1991చూసినవారు
వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా అనసూయ సురేష్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వై యస్ ఆర్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆచంట అనసూయ సురేష్ గురువారం ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన అనసూయ రెండోసారి ఈ పదవిని చేపట్టారు. ఈ నియామకంపై గోపాలపురం నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షుడు గొర్రెల సాంబశివ నాయుడు, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి కృషి చేసిన మాజీ హోంమంత్రి తానేటి వనితకు అనసూయ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన తూర్పు గోదావరి, గోపాలపురం ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్