రాజమహేంద్రవరంలో, బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తగరం సురేష్ బాబు అధ్యక్షతన సంత్ శిరోమణి గురు శ్రీ రవిదాస్ జి 649వ జయంతి ఉత్సవాల నిర్వహణపై సమావేశం శనివారం జరిగింది. కేంద్ర, రాష్ట్ర బీజేపీ అధిష్టానం సూచనల మేరకు జనవరి 31 నుండి ఫిబ్రవరి 7 వరకు శ్రీ రవిదాస్ జి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మోర్చా రాష్ట్ర సెక్రటరీ మట్టాడి రమణ, మోర్చా జోనల్ ఇంచార్జి దున్న సుమన్ బాబు, కార్యక్రమాల జిల్లా కన్వీనర్ యజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.