తూగో జిల్లా, నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకటవ తేదీ రాగానే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు చుక్క శ్రీను తెలిపారు. త్వరలోనే కొత్త పెన్షన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తుందని గుడిసె శివకృష్ణ పేర్కొన్నారు.