దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు పెనుమాక వెంకటేష్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి బుధవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పేదల పెన్నిధి, సంక్షేమానికి చిరునామా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.