గోపాలపురం నియోజకవర్గంలో గత నెల రోజులుగా జరిగిన దుద్దుకూరు ప్రీమియర్ లీగ్ (DPL) – సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ నేడు ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో దుద్దుకూరు జట్టు ధవళేశ్వరం జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో దుద్దుకూరు జట్టు రూ 1,00,001 నగదు బహుమతిని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన ధవళేశ్వరం జట్టుకు ₹44,444 నగదు బహుమతి లభించింది. టోర్నమెంట్ అంతటా దుద్దుకూరు జట్టు ఆటతీరు, క్రమశిక్షణ, పోరాట పటిమ అభిమానులను ఆకట్టుకున్నాయి.