మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు: సొసైటీ డైరెక్టర్‌కు ఘన సన్మానం

929చూసినవారు
తూగో జిల్లా గోపాలపురం లో నల్లజర్ల సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణను అధికారులు ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పి4లో భాగంగా 60 వేల రూపాయల విలువైన మినరల్ వాటర్ ప్లాంట్‌ను అమర్చినందుకు ఆయనకు ఈ సన్మానం దక్కింది. ద్వారకా తిరుమల వెళ్లే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఈ నీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గుడిసె శివ కృష్ణకు దక్కిన ఈ అరుదైన సన్మానం పలువురి ప్రశంసలు అందుకుంది.

సంబంధిత పోస్ట్