దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు పంపించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.