ఉపాధి హామీ పనులను పరిశీలించిన హజ్ కమిటీ డైరెక్టర్ మీరా సాహెబ్

549చూసినవారు
ఉపాధి హామీ పనులను పరిశీలించిన హజ్ కమిటీ డైరెక్టర్ మీరా సాహెబ్
నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరా సాహెబ్ గురువారం పర్యవేక్షించారు. మట్టి తవ్వకాలు, కాలువలను శుభ్రపరిచే పనులను పరిశీలించి, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో కొనసాగాలని, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్