గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎంపీపీ కె.వి.కె. దుర్గారావు పాల్గొన్నారు. ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. మండల వ్యాప్తంగా మొత్తం 66 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, సుమారు 9,866 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు.